వరుణ్ తేజ్-శేఖర్ కమ్ముల మూవీ ‘ఫిదా’ రిలీజ్ డేట్ ఖరారు

Varun Tej

Varun Teja’s New Movie Fidaa

వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫిదా’ మూవీ రిలీజ్ డేట్ ఖరారైంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం జులై 21న విడుదలవుతోంది.

ఇటీవల విడుదలైన ‘ఫిదా’ మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. లవర్ బాయ్ క్యారెక్టర్లో వరుణ్ తేజ్‌ను ఈ చిత్రంలో సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నాడు శేఖర్ కమ్ముల. మళయాలం మూవీ ప్రేమమ్‌తో సౌత్‌లో బాగా పాపులర్ అయిన సాయి పల్లవి ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతోంది.

ఇప్పటికే విడుదలైన సాయి పల్లవి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లు చూసి తెలుగు అభిమానులు ఫిదా అయ్యారు. వరుణ్ తేజ్, సాయి పల్లవి జోడీ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడం సినిమాపై అంచనాలు మరింత పెంచింది. వరుణ్ తేజ్ ఎన్నారైగా కనిపించనున్న ఈ సినిమాలో సాయి పల్లవి ఒక తెలంగాణ అమ్మాయిగా నటించింది.

దర్శకుడు శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ”చక్కని ప్రేమకథతో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఆనంద్ , గోదావరి తర్వాత పూర్తిస్థాయి ప్రేమకథతో సినిమా చేయలేదు. ఈ సినిమాకు మంచి యూత్‌ఫుల్‌ కథ కుదిరింది. వరుణ్‌, సాయిపల్లవి జంట చూడముచ్చటగా ఉంటుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here