375+ Telugu Samethalu – A to Z Telugu Samethalu in Telugu Script & English

Telugu Samethalu

Telugu Samethalu – తెలుగులో అనేక గొప్ప సామెతలు ఉన్నాయి. సామెతలను తెలుగులో జాతీయాలు అని కూడా అంటారు. తెలుగు సామెతలని ఉపయోగించి చిన్న పదాలతో కూడా పెద్ద అర్ధం వచ్చేలాగా చెప్పవచ్చు. మాట్లాడేటప్పుడు సామెతలని తెలివైన అర్ధం వచ్చేలాగా మనం ఉపయోగించవచ్చు, సామెతలని మాటల మధ్యలో వాడడం వాళ్ళ, మాట్లాడే వాళ్ళకి తెలుగు భాషపై ఎంత పట్టుంది అనే విషయం తెలుస్తుంది. మీరు కూడా ఈ సామెతలని మీరు మాట్లాడేటప్పుడు ఉపయోగించి మీకు తెలుగు భాషపై ఉన్న పట్టుని తెలియచేస్తూ, మీ స్నేహితులని బంధువులని మీతో మాట్లాడే వాళ్ళని ఆశ్చర్యానికి గురిచేయండి.

Telugu Samethalu

ఇంకెందుకు ఆలస్యం, పదండి ఇప్పుడే మనం ఇక్కడ సేకరించినటువంటి 375 తెలుగు సామెతలు తెలుసుకొందాం. ఇక్కడ దాదాపుగా అన్ని అక్షరాలతో మొదలయ్యే ( ఆ- ఱ) తెలుగు సామెతలను, ఇంగ్లీష్ అక్షర క్రమంలో పేర్కొనడం జరిగింది. ఇక ఈ క్రింద పొందుపరిచిన తెలుగు సామెతలను చదువుతూ ఆస్వాదించండి.

Telugu Samethalu in Telugu Script

Telugu Samethalu – తెలుగు సామెతలు

Telugu Samethalu in English

అడుసు తొక్కనేల కాలు కడగనేలAdusu thokkanela kaalu kadaganela
అగ్నికి వాయువు తోడైనట్లుAgniki vaayuvu thodyinattu
అడుక్కునేవాడికి అరవైఆరు కూరలుAdukkunevaadiki arviaaru kooralu
అతి వినయం ధూర్త లక్షణంAthi vinayam dhurtha lakshanam
అత్త మీద కోపం దుత్త మీద తీర్చుకున్నట్లుAtta meedha kopam dutta meedha terchukunnattu
అతి రహస్యం బట్టబయలుAthi rahasyam battabayalu
అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లుAtta sommu alludu dhanam chesi nattu
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుAdhigo puli ante idhigo thoka annadata
అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదుAdhrustam cheppiraadu duradhrustam cheppi poodu
అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలుAtta leni kodalu uttamuraalu,kodalu leni atta gunavanthuraalu
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుAdhigo puli ante idhigo thoka annadata
అధికమైతే అమృతం కూడా విషమేAdhikamyithe amrutham kudaa vishame
అనగా అనగా రాగం తినగా తినగా రోగంAnaga angaa raagam tinaga tinagaa rogam
అనుమానం పెనుభూతంAnumanam penubhutham
అన్నదానం కన్నా విద్యాదానం మిన్నAnnadhanam kanna vidhyaadhanam minna
అనుభవమే శాస్త్రం, మాటలే మంత్రాలుAnubhavame sasthram,maatale manthralu
అన్నం చొరవే గానీ అక్షరం చొరవ లేదుAnnam choravegaani aksharam chorava ledhu
అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లుడు నోట్లో శని ఉందిAngatloa annee unnaayi kaanee alludu noatloa sani undi
అడవి కాచిన వెన్నెలAdavi kaacina vennela
ఆడిగేవాడికి చెప్పే వాడు లోకువAdige vaadiki cheppe vaadu lokuva
అచ్చి పెళ్ళి బుచ్చి చావుకు వచ్చిందంటAcchi pelli bucchi chavuku vachhindanta
ఆనువు గాని చోట అధికులమనరాదుAnuvu gaani choata adhikulamanaradhu
అప్పిచ్చు వాడు బాగుకోరతాడు తీసుకునేవాడు చెడు కోరతాడుAppichu vaadu baagu korathadu teesukunevaadu chedu korathadu
ఆరటి పండు వలచి చేతిలో పెట్టినట్టుArati pandu valachi chetiloa pettinattu
ఆకాశానికి నిచ్చెన వేసినట్టుAakaasaniki nuchhina vesinattu
అరిచే కుక్క కరవదుArichea kukka karavadu
అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో పెట్టినట్టుAyinavaariki aakulloa kaanivaariki kanchaalloa pettinattu
అర్ధరాత్రి వేళ అంకమ్మ శివాలనట్టుArdharaatri veala amkamma sivaalanattu
అడ్దాలనాడు బిడ్డలు కాదు గడ్డాల నాడు బిడ్డలా ?Addalaanaadu biddalu kaadu gaddala naadu biddala ?
ఆరణ్యరోదనంAranyarodhanam
ఆకలి ఆకాశమంత గొంతు సూది బెజ్జమంతAakali aakaasamamta gomtu suudi bejjamamta
ఆచారానికి అంతం లేదు,అనాచారానికి ఆది లేదుAacaaraaniki amtam leadu,anaacaaraaniki aadi leadu
ఆడబోయి తీర్ధం ఎదురువచ్చినట్టుAadaboayi teerdham eduruvaccinattu
ఆడింది ఆట పాడింది పాటAadindhi aata paadindhi paata
ఆడే కాలు పాడే నోరుAade kaalu paade noru
ఆరంభ శూరత్వంAaramba surthvam
ఆరునెలలు సావాసం చేస్తే వారు వీరవుతారుAarunelalu saavaasam ceastea vaaru veeravutaaru
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా ?Aavu chelo meste duda gattuna mestundha ?
ఆడలేక మద్దెల మీద పడ్డట్టుAadaleka maddela meedha paddattu
ఆడి తప్పరాదు పలికి బొంకరాదుAadi tapparaadu paliki bomkaraadu
ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగమన్నాడటAaluu leadu cuuluu leadu koduku pearu soamalimgamannaadata
అగ్నిలో ఆజ్యం పోసినట్టుAgnilo ajyam posinattu
ఆయనగారుంటే మంగలితో పనేంటిAayanagaarumtea mamgalitoa paneamti
అత్తవల్ల దొంగతనం మొగుడు వల్ల రంకుతనం నేర్చుకున్నట్టుAttavalla domgatanam mogudu valla ramkutanam nearcukunnattu
అన్నం పెట్టిన వాడింటికి కన్నం వేసినట్టుAnnam pettinavaadintike kannam vesinattu
అప్పు చేసి పప్పు కూడు తిన్నట్టుAppu chesi pappu kudu tinattu
అబద్దం ఆడినా అతికినట్టుండాలిAbaddam aadinaa atikinattumdaali
అమ్మబోతే అడవి కొనబోతే కొరివిAmmaboatea adavi konaboatea korivi
అవివేకితో స్నేహం కన్నా వివేకితో విరోధం మేలుAviveakitoa sneaham kannaa viveakitoa viroadham mealu
అంగట్లో అరువు గుండెల్లో బరువుAmgatloa aruvu gumdelloa baruvu
అంగడి అమ్మి గొంగలి కొన్నట్టుAmgadi ammi gomgali konnattu
అంటనపుడు ఆముదం రాసుకున్నా అంటదుAtanapuDu aamudam raasukunnaa amTadu
అంచు డాబేకానీ పంచె డాబు లేదటAnchu daabeakaanee panche daabu leadata
అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అన్నట్టుAndani draaksha pallu pullana annattu
అందరికీ అట్ల పండుగ,మనకు ముట్ల పండుగAmdarikee atla pamduga,manaku mutla pamduga
అచ్చుబోసిన ఆంబోతుAcchuboasina aamboatu
అన్నం వుడికిందో లేదో అంతా పట్టి చూడక్కర్లేదుAnnam vudikimdoa leadoa amtaa patti cuadakkarleadu
అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రం ఊడిపోయిందంటAnna vastraalaku poatea unna vastram uudipoayimdamta
అమ్మ కడుపు చూస్తుంది ఆలి వీపు చూస్తుందిAmma kadupu chuustumdi aali veepu cuustundi
అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గరAmma puttillu menamama daggara
అరవ చాకిరిArava chakiri
అరువు సొమ్ములు బరువు చేటుAruvu sommulu baruvu ceatu
అల్పుడెపుడు పల్కు ఆడంబరంగానుAlpudepudu palku aadambaramgaanu
అవ్వా కావాలి బువ్వా కావాలిAvvaa kaavaali buvvaa kaavaali
ఆకులు ఎత్తరా అంటే విస్తళ్ళు లెక్క పెట్టాడటAakulu ettaraa amtea vistallu lekka pettaadanta
ఆడదాని నోట్లో నువ్వు గింజ కూడా దాగదుAaDadaani noatloa nuvvu gimja kuudaa daagadu
అగసాలిని,వెలియాలిని నమ్మకూడదుAgasalini,viliyalini nammakudadhu
ఆకలి అదుపు ఇంటికి పొదుపుAakali adupu intiki podhupu
ఆరు నూరయినా అదంతేAaru nuurayinaa adamtea
ఆరొగ్యమే మహాభాగ్యంaarogyamea mahaaBaagyam
అండలు ఉంటే కొండలు దాటవచ్చుAndalu umtea kondalu daatavacchu
అంతా అయినవాళ్ళే కానీ మంచి నీళ్ళు పుట్టవుAntaa ayinavaallea kaanee manci neellu puttavu
అగ్గి మీద గుగ్గిలం జల్లినట్టుAggi meedha guggilam jallinattu
అచ్చుపోసిన ఆంబోతులాగాAcchu posina aambothu laaga
అందరూ శ్రీ వైష్టవులయితే బుట్టడు రొయ్యలు ఏమయినట్టుAndaruu Sree vaishtavulayitea buttadu royyalu eamayinattu
Telugu Samethalu Starting With Letter B
బాల వాక్కు బ్రహ్మ వాక్కుBaala vaakku brahma vaakku
బతకలేక బడి పంతులుBathakaleka Badi Panthulu
బరితెగించిన కోడి బజార్లో గుడ్డెట్టిందటBari teginchina kodi bajarulo guddettindhanta
బావిలో కప్పకి లోకమేమి తెలుసుBhavilona kappaki lokamemi telusu
బెల్లం చుట్టూ ఈగలు లాగాBallam chuttu eegalu laagaa
బొండు మల్లెలు బోడి తలకెందుకు?Bondu mallelu bodi thalakendhuku
బుగ్గ గిల్లి జోల పాడినట్టుBugga gilli jola padinattu
బలవంతుడికి గడ్డిపరక కూడా ఆయుధమేBalavanthudiki gaddi paraka kuda ayudhame
బూడిదలో పోసిన పన్నీరుBoodidhalo posina panneeru
బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళBiddochina vela goddochhina vela
బతికి పట్నం చూడాలి చచ్చి స్వర్గం చూడాలిBatiki patnam chudali chacchi swargam chudali
బెండకాయ ముదిరినా,బ్రహ్మచారి ముదిరినా పనికిరావుBendakaya mudirina brhmachari mudirina paniki raavu
బ్రహ్మ కైన తిరుగు రిమ్మ తెగులుBrhmakaina tagulu rimma tegulu
బ్రతికుంటే బలుసాకు తిని బతకొచ్చుBatikunte balusakyina tini batakavacchu
బంగారు పిచ్చుకBogaaru piccuka
బావ మరుదుల బ్రతుకు కోరును,దాయాదుల చావు కోరునుBaava marudula bratuku koarunu,daayaadula caavu koarunu
బ్రాహ్మణుడి నోరూ,ఏనుగు తొండమూ ఊరుకోవుBrahmanudi noru,enugu thondamu urukovu
భోజనానికి ముందు స్త్నానానికి వెనుకBhojananiki mundu stnanaiki venuka
భిక్షాధికారికయినా కావాలి,లక్షాధికారికయినా కావాలిBhikshaadhikaarikayinaa kaavaali,lakshaadhikaarikayinaa kaavaali
భక్తిలేని పూజ పత్రి చేటుBhakthi leni puja patri chetu
భాషలు వేరైనా భావమొక్కటేBashalu verayina bhavam okkate
భార్యా రూపవతి శత్రు:Bharyaa rupavathi sathru
బోడి ముండకి మంగళ హారతి ఒకటిBodi mundaku mangala harathi okati
భక్తి మనదే భుక్తి మనదేBhakti manadhe bukthi manadhe
భరతుడికి పట్టం,రాముడికి రాజ్యంBarathudiki pattam ramudiki rajyam
Telugu Samethalu Starting With Letter C
చాప కింద నీరులాChapakinda neerulaga
చక్కనమ్మ చిక్కినా అందమేChakkanamma chikkinaa andhame
చివికి చివికి గాలి వానైనట్లుChiviki chiviki gaali vaana ayinattu
చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లుChetulu kaalaka aakulu pattukunnattu
చదువు వస్తే ఉన్న మతి పోయిందనిChaduvu vaste unna mathi poyindani
చింత చచ్చిన పులుపు చావలేదటChinta chachina pulupu chavaledu
చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నంChaccinodi pelliki vachinde katnam
చెడపకురా చెడేవుChedapkura chedevu
చెవిటి వాడి చెవిలో శంకం ఊదినట్లుChevti vaadi chevilo sankam voodinattu
చేతకాని అమ్మకే చేష్టలు ఎక్కువChetakaani ammke chestalu ekkuva
చాదస్తపు మొగుడు చెబితే వినడు కొడితే ఏడుస్తాడుChedastapu mogudu chebite vinadu kodithe edustadu
చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలిChinna pamunayina pedda karratho kottali
చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టుChankalo pilladini pettukuni urantha vedikinattu
చెడపకురా చెడేవుChrapakura chedevu
చావుతప్పి కన్నులొట్ట పోయినట్లుChavu tappi kannu lotta poyinattu
చద్దికంటె ఊరగాయ ఘనంChaddi kante uragaya ghanam
చల్లకొచ్చి ముంత దాచినట్లుChallaku vachhi muntha dachinattu
చిలికి చిలికి గాలి వాన అయినట్లుChiliki chiliki gaali vaana ayinattu
చెప్పేవాడికి వినేవాడు లోకువCheppe vaadiki vinevaadu lokuva
చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలుCheppevi sreeranga neethulu doorevi dommari gudeselu
చేతకాక మంగళవారమన్నాడంటChetakaka mangalavaaramannadata
చెముడా అంటే మొగుడా అన్నట్టుChemuda ante nee moguda annadata
చేనుకు గట్టు వూరికి కట్టు ఉండాలిChenuku gattu ooriki kattu undali
చేసేవి శివ పూజలు, చెప్పేవి అబద్దాలు.Chesevi siva pujalu cheppevanni abadhhalu
చిదంబర రహస్యంCidambara rahasyam
Telugu Samethalu Starting With Letter D
డబ్బు కోసం గడ్డి తినే రకంDabbu kosam gaddi tine rakam
డబ్బే దైవముDabbe dhivamu
డబ్బుకు లోకం దాసోహంDabbuku lokam dasoham
డబ్బు పాపిష్టిదిDabbu papistidhi
డబ్బుకు ప్రాణానికి లంకెDabbuku prananiki lanke
డబ్బుంటే చాలు కొండ మీద కోతి అయినా దిగి వస్తుందిDabbunte chalu kondameeda kothi ayina digi vastundi
డూడూ బసవన్నా అంటే తల ఊపినట్టుDuuduu basavannaa amtea tala uupinattu
డూడూ బసవన్నా అంటే తల ఊపినట్టుDudu basavanna ante thala upinattu
డాబుసరి బావా అంటే డబ్బు లేదు మరదలా అన్నాడటDaabusari baavaa antea dabbu leadu maradalaa annaadata
డబ్బు రాని విద్య దరిద్రానికేDabbu raani vidhya dharidhranike
Telugu Samethalu Starting With Letter E, I
ఇంటికన్నా గుడి పదిలంIntikanna gudi padhilam
ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారుInta gelichi raccha gelavamannaru
ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడుInti donganu eeswarudina pattaledu
ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకీల మోతIntlo eegala mota veedhilo pallaki motha
ఇంటెద్దుకు బాడిగలేదుIntedduku badiga ledhu
ఇంటి పేరూ కస్తూరి వారు ఇంటినిండా గబ్బిలాల కంపుInti peru kasturi illantha gabbilala kampu
ఇంటివారు వేలు చూపితే బయటివారు కాలుచూపుతారుInti vaaru velu chupithe bayata vaaru kalu chuputharu
ఇల్లు చూసి ఇల్లాలిని చూడమన్నారుIllu chusi illalini chudamannaru
ఇంటి గుట్టు లంకకు చేటుInti guttu lankaku chetu
ఇదిగొ పులి అంటే అదిగో తోక అన్నాడటIdigo puli amtea adigoa toaka annaadata
ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడుIllu katti chudu pelli chesi chudu
ఇల్లు పీకి పందిరి వెసినట్టుIllu peeki pandiri vesinattu
ఇసుక తక్కెడ పేడ తక్కెడIsuka takkeda peda takkeda
ఇచ్చేవాన్ని చూస్తే చచ్చే వాడయినా లేస్తాడుIchhe vanni chuste chache vadina lestadu
ఇరుగు ఇంగళం పొరుగు మంగళంIrugu ingalam porugu mangalam
ఇల్లరికం కన్నా మాలరికం మేలుIllarikam kannaa maalarikam mealu
ఇల్లు అలకగానే పండుగ అయ్యిందాIllu alakagane panduga ayyinda
ఇష్టారాజ్యం భరతుడి పట్టంIstarajyam bharathudi pattam
ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్యIntlo ramayya veedhilo krishnayya
ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టుInthabatuku batiki intenakala chachhinattu
ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మంIdham kshatram idham brahmam
ఇల్లలకగానే పండగకాదుIllalkagane panduga kadhu
ఇల్లు ఇరకాటం, ఆలి మర్కటంIllu irakatam aali marakatam
ఇల్లుకాలి ఒకడేడుస్తుంటే, చుట్టకి నిప్పు అడిగాడంటొకడుIllu kaali okadedustunte chuttakki nippadiganta
ఇష్టమైన వస్తువు ఇంగువతో సమానంIstamayina vastuvu inguvatho samanam
Telugu Samethalu Starting With Letter G
గుంపులో గోవిందాGumpuloa govindha
గంగిగోవు పాలు గరిటడైన చాలుGangi govu palu garitadina chalu
గతి లేనమ్మకు గంజే పానకముGatilenammaku ganje panakam
గంతకు తగ్గ బొంతGantaku tagga bontha
గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్టుGuddu vacchi pillanu vekkirichhinattu
గాడిద కేమి తెలుసు గంధం చెక్కల వాసనGaadidhaku emi telusu gandhapu chekkala vasana
గుడిని, గుడిలో లింగాన్ని మింగినట్లుGudini gudilo linganni minginattu
గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నాట్టGaalilo deepam devuda neede bharam annadata
గట్టు దాటే దాకా ఓడ మల్లన్న…గట్టు దాటాక బోడి మల్లన్నGattu datedhaka oda mallanna gattu dataka bodi mallanna
గారాబం గజ్జెలకేడిస్తే, వీపు గుద్దులకేడ్చిందంటGaarabam gajjelakediste veepu debbalaku edchindanta
గుడ్ల మీద కోడిపెట్టలాGuddlameeda kodi pettala
గురివింద గింజ తన కిందున్న నలుపెరగదంటGurivinda ginja tana kindunna naluperagadanta
గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుGummadi kaya donga evrante bujaalu thadumukunnattu
గురువుకి పంగనామాలు పెట్టినట్లుGuruvuki panganaamalu pettinattu
గుర్రం గుడ్డిదైనా దాణాకు తక్కువ లేదుGurram guddidina danaku takkuva ledhu
గోటితో పోయేదానికి గొడ్డలి వాడినట్లుGotitho poyedaniki goddali vadinattu
గోతి కాడ నక్కలాGoti kada nakala
గోరుచుట్టు మీద రోకలిపోటుGoru chuttu meeda rokalipotu
గుడ్డెద్దు చేలో పడినట్లుGuddeddu chelo padinattu
గోవు లేని ఊళ్ళో గొడ్డు గేదే శ్రీ మహాలక్ష్మిGoavu leani uullo goddu geadea sree mahaalakshmi
గొడ్రాలికేం తెలుసు బిడ్డ నొప్పిGodralikem telusu bidda noppi
గతించిన దానికి చింతించనేలGatimcina daaniki cimtimcaneala
గుడ్డి కన్నా మెల్ల మేలుGuddi kanna mella melu
గాలిలో మేడలు కట్టినట్టుGaalilo medalu kattinattu
ఘడియ తీరుబాటూ లేదు,దమ్మిడీ ఆదాయమూ లేదుGadiya teerubaatu ledhu,dhmmide adhayamu ledhu
Telugu Samethalu Starting With Letter H
హేమా హేమీలే ఏట్లో కొట్టుకుపోయారుHema hemele kottukupoyaru
హనుమంతుడు అందగాడుHanumatudu andhagadu
హనుమంతుడి ముందా కుప్పిగంతులు?Hanumantudu mundha kuppigantulu
Telugu Samethalu Starting With Letter I
ఐశ్వర్యానికి అంతము లేదుIswaryaniki antham ledhu
ఐదు వేళ్ళు ఒకేలా ఉండవుIdhu vellu okela undavu
Telugu Samethalu Starting With Letter J
జన్మకో శివరాత్రి అన్నట్లుJanmako sivarathri annattu
జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధిJihvako ruchi purreko buddi
జోడు గుఱాలపై స్వారీ చేసినట్లు.Jodu gurralapi swari chesinattu
జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేలJagamerigina brahmanudiki jandhyamela
జుట్టు అంటూ ఉంటే ఏ జడైనా వేసుకొవచ్చుJuttu antu unte ejadaina vesukovachhu
జరిగినమ్మ జల్లెడు తోనైనా నీళ్ళు తెస్తుందిJariginamma jalleda tho ayina neeru testundhi
జీతం భత్తెం లేని ఉద్యోగంJeetam bhattem leani udyoagam
జన వాక్యం జరగక తప్పదుJana vaakyam jaragaka tappadu
జోగీ జొగీ రాసుకుంటే బూడిద రాలిందంటJogee jogee rasukunte budidha ralindanta
జయాప జయాలు ధైవాదీనాలుjayaapa jayaalu dhivaadheenalu
Telugu Samethalu Starting With Letter K
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?Kanchu mroginattu kankambu mroguna
కంచానికి ఒక్కడు, మంచానికి ఇద్దరుKanchaniki okkadu manchaniki iddaru
కందకి లేని దురద కత్తిపీటకెందుకు?Kandaku leni duradha katthipeetakenduku
కక్కొచ్చినా కళ్యాణ మొచ్చినా ఆగవుKakkochina kalyanamocchina agavu
కడివెడు గుమ్మడికాయైనా కత్తిపీటకి లోకువేKadivedu gummadi kayaina kattipeetaku lokuve
కడుపులో లేనిది కౌగలించుకుంటే వస్తుందా?Kadupulo lenidhi kaugilinchukunte vastundha
కలసి ఉంటే కలదు సుఖంKalasi unte kaladhu sukham
క్రింద పడ్డా నాదే పైచేయి అన్నాడంటkrinda padda nadhe pai chyaa annadata
కూర్చుని తింటే, కొండలైనా తరిగిపోతాయిKurchuni tinte kondalaina karugutayi
కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టుKonda nalukaku mandeste unna naluka udindanta
కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడుKotta bichagadu podderagadu
కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుKondanu tavvi elukanu pattinattu
కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలిKodithe enugu kumbha sthalame kottali
కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్లుKuse gadidha vachhi mese gadidhani chedagottindhi
కోటి విద్యలు కూటి కోసమేKoti vidhyalu kuti kosame
కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకంKodi guddu medha eekalu peke rakam
కోడలికి బుధ్ధి చెప్పి అత్త తెడ్డి నాకిందిKodaliki buddi cheppei atta chedindhi
కాకిముక్కుకి దొండపండుKaaki mukkuki donda pandu
కాపురం చేసే కళ కాళ్ళ పారాణి దగ్గరే తెలుస్తుందిKapuram chese kala kalla paranee appude telustundi
కుక్కతోక వంకరన్నట్లుKukka thoka vankara annattu
కుప్ప తగులపెట్టి.. పేలాలు ఏరుకుతిన్నట్లు…Kuppa tagalubetti pelalu eruku tinnattu
కాలు కాలిన పిల్లిలాKaalu kalina pillila
కాగల కార్యం గంధర్వులే తీర్చారుKaagala karyam gandharvule tercharu
కడుపు నిండిన వాడికి గారెలు చేదుKadupu nindina vadiki garelu chedu
కధ కంచికి మనం ఇంటికిKatha kanchiki manam intiki
Telugu Samethalu Starting With Letter L
లేడికి లేచిందే పరుగుLediki lechinde parugu
లోగుట్టు పెరుమాళ్ళ కెరుకLoguttu perumllaku eruka
లోకం పోకడLokam pokada
లంచమిస్తే గానీ మంచమెక్కదుLamcamistea gaanee mamcamekkadu
లేని దాత కంటే ఉన్న లోభి నయంLeni dathakante unna lobhi nayam
లాభం గూబలోకి వచ్చినట్టుLabham gubaloki vachhinattu
లేని వాడు లేక ఎడిస్తే ఉన్నవాడు తినలేక ఏడ్చాడటLeani vaadu leaka edistea unnavaadu tinaleaka eadchaadata
లోన లొటారం పైన పటారంLona lotaram pain pataram
లోభి సొమ్ము లోకుల పాలుloabhi sommu lookula paalu
లేకుండా చూసి పోకుండా పట్టుకున్నట్టుLekunda chusi pokunda pattukunnattu
Telugu Samethalu Starting With Letter M
మంది ఎక్కువైతే మజ్జిగ పలచనMandhi ekkuvayithe majjiga palachana
మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత వలక బోసుకున్నట్లుMabbullo neellu chusi muntha valakabosukunnattu
మింగ మెతుకు లేదు మీసాలకి సంపెంగ నూనెMinga methuku ledhu meesalaku sampenga nune
మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడమన్నట్లుMaa tatalu netulu tagaru maa mootulu vasana chudamannattu
మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవడం దేనికి?Mana bangaram manchidi ayite oollo vaallani anadam deniki
మంత్రాలకు చింతకాయలు రాలుతాయా?Manthralaku chintakayalu ralathaya ?
మంచోడు, మంచోడు అంటే, మంచమెక్కి ఏదో చేసాడంటManchodu manchodante manchamekki edo chesadanta
మొక్కయి వంగనిది, మానయ్యాక వంగునా?Mokkayyi vanganadi manayyite vangutundha ?
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుMoolige nakka medha tatikaya padinattu
ముడ్డి గిల్లి జోల పాడటమంటే ఇదేMuddi gilli jola padatam ante idhe
మొరటోడికి మల్లెపూలు ఇస్తే మడిచి ఎక్కడో పెట్టుకున్నాడంటMoratodiki mallepulu iste madichi ekkado pettukunnadata
ముద్దొచ్చినప్పుడే, చంకనెక్కాలిMuddochinapude chankanekkali
ముందుంది ముసళ్ళ పండుగMundhundi musalla panduga
మొండివాడు రాజు కన్నా బలవంతుడుMondi vaadu rajukanna balavanthudu
ముందు నుయ్యి వెనుక గొయ్యిMundu niyyi venka goyyi
మొరిగే కుక్క కరవదుMorige kukka karavadhu
మౌనం అర్ధాంగీకారంMunam ardhangeekram
మంచికి పోతే చెడు ఎదురయినట్టుManchiki pothe chedu edurayinattu
మోసేవాడికి తెలుస్తుంది కావిడి బరువుMose vadiki telustundi kavidi baruvu
మనోవ్యాధికి మందు లేదుManovyadhiki mandhu ledhu
మగవాడు తిరగక చెడ్డాడు ఆడది తిరిగి చెడిందిMagavaadu tiragaka cheddadu aadadhi tirigi chedindi
మన్ను తిన్న పాముMannu tinna paamu
మేక వన్నె పులిMeka vanne puli
మట్టిలో మాణిక్యంలాMattilo maanikyamla
మతిలేనమ్మకు గతిలేని మొగుడుMathilenammaku gatileni mogudu
Telugu Samethalu Starting With Letter N
నవ్విన నాప చేనే పండిందంతNavvina Napa chene pandindanta
నలుగురితో నారాయణా కులంతో గోవిందాNalugurito narayana kulam tho govinda
నిత్య కళ్యాణం, పచ్చ తోరణంNitya kalyanam pacha thoranam
నిప్పులేనిదే పొగరాదుNippu lenidhe poga radhu
నిజం నిప్పులా౦టిదిNijam nippu lantidhi
నివురు గప్పిన నిప్పులాNivuru gappina nippula
నడిచే కాలు, వాగే నోరు ఊరకుండవుNadiche kalu vaage noru urikeundavu
నీతిలేని పొరుగు నిప్పుతో సమానంNeethi leni porugu nipputho samanam
నీటిలో రాతలు రాసినట్లుNeetilo rathalu vrasinattu
నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందిNoru mancidi ayithe ooru manchidi avutundi
నేతిబీరలో నేతి చందంలాNethi beeralo nethi chandhamla
నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లుNotitho navvi nosatitho vekkirinchinattu
నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చస్తుందిNooru godlanu tinna rabandhu okka gali vanaku chastundi
నూరు చిలుకల ఒకటే ముక్కుNooru chilaka okate mukku
నడమంత్రపు సిరిNadamamtrapu siri
నరం లేని నాలుక నాలుగు విధాలుNaram leani naaluka naalugu vidhaalu
నవ్వే ఆడదాన్ని ఎడ్చే మగాన్ని నమ్మకూడదుNavve adadhanni edche magavanni nammakudadhu
నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగుNeeru pallamerugu
నిప్పుకు చెదలంటుతుందాNippuku chedalantutundha
నిమ్మకు నీరెత్తినట్టుNimmaku nerettinattu
నానాటికి తీసుకట్టు నామంభొట్లుNaanatiki teesikattu namambhotlu
నవ్వు నాలుగు విధాల చేటుNavvu naalugu vidhalaa chetu
నోటి ముత్యాలు రాలి పోతాయాNoti muthyalu ralipothaya
నక్కజిత్తులు నారాయణుడెరుగుNakka jittulu narayanuderugu
నక్క ఎక్కడ నాగాలోకమెక్కడNakka ekkada nagalokamekkada
Telugu Samethalu Starting With Letter O
ఒక వరలో రెండు కత్తులిమడవుOka varalo rendu kattulu imadavu
ఒక దెబ్బకు రెండు పిట్టలుOka debbaku rendu pittalu
ఒక కొడుకు కొడుకూ కాదు,ఒక కన్ను కన్నూ కాదుOka koduku koduku kadhu oka kannu kannu kadhu
ఒడ్డున కూర్చొని గడ్డలు వేసేవాడికి ఏం తెలుసు ఈదే వాడి బాధOdduna kurchuni gaddalu vesevadiki em telusu eede vaadi bhada
ఒల్లని మొగుడు తలంబ్రాలు పోసినట్టుOllani mogudu thalambralu posinattu
ఒక పూట తినేవాడు యోగి రెండు పూటలా తినే వాడు రోగిOka puta tinevadu yogi rendu putala tinevadu bhogi
ఒక ఊరి కాపు మరో వూరికి వెట్టిOka uuri kaapu maroa vuuriki vetti
ఓటి కుండలో నెళ్ళు పోసినట్టుOoti kundalo nellu posinattu
ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలవుతాయిOodalu ballavuthayi ballu odalavuthayi
ఓడ ఎక్కేదాక ఓడమల్లన్న ఓడ దిగాక బొడి మల్లన్నOda ekkedhaka oda mallanna oda ekkaka bodi mallanna
Telugu Samethalu Starting With Letter P
పండగ నాడు కూడా పాత మొగుడేనాPandaga naadu kuda patha mogudena
పండిత పుత్ర పరమ శుంఠPanditha putra parama shunta
పని లేని మంగలి పిల్లి తల గొరిగినట్లుPani leni mangali pilli thala goriginattu
పళ్లూడగొట్టుకోడానికి ఏ రాయైతేనేమి?Pallu odagottukovadaniki ee raya ayithe emiti
పడుకున్న గాడిదను లేపి తన్నించుకున్నట్టుPadukunna gadidhani lepi tanninchukunnattu
పరుగెత్తి పాలుతాగే కంటే,నిలబడి నీళ్ళు తాగటం మేలుParugetti paalu tagadam kante nilabadi nellu tagadam melu
పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాడుPaddavadepudu chedda vaadu kaadu
పక్కలో బల్లెంPakkalo ballem
పనోడు పందిరేస్తే పిచ్చుకలొచ్చి పడగొట్టాయ్Panodu pandhiri veste picchukulu vachi padagottayanta
పందికేంతెలుసు పన్నీరు వాసనPandikem telusu panneru vaasana
పాలు, నీళ్ళలా కలిసిపోయారుPaalu nellala kalasipoyaru
పిచ్చోడి చేతిలో రాయిPicchodi chethilo rayi
పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బPillakakikem telusu undelu dhebba
పిండి కొద్దీ రొట్టెPindi koddi rotti
పిచ్చెమ్మ తెలివి వెర్రెమ్మ మెచ్చుకోవాలిPichemma thelivi verremma mechukovali
పిల్లికి బిచ్చం పెట్టనివాడుPilliki bicham pettani vaadu
పిల్ల నచ్చిందా అల్లుడూ అంటే.నువ్వే నచ్చావత్తా అన్నాడంటPilla nachhinda alludu ante nuvve nachhav atta annadata
పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచిPurreko buddi jihvako ruchi
పుట్టుకతో వచ్చిన బుద్ది, పుడకలతో గానీ పోదుPuttukatho vachina budhhi pudakalatho gaani podhu
పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలుPunyam koddi purushudu,danam koddi biddalu
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుPulini chusi nakka vaatha pettukunnattu
పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుPenam meedanundi poyyalo padinattu
పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంటPenuki pettanam iste thalantha gorigindhanta
పెట్టే వాడు మన వాడైతే ఎక్కడ కూర్ఛున్నా ఫర్వాలేదుPette vaadu mana vadayithe ekkada kurchunna paravaledhu
పొట్టోడికి పుట్టెడు బుద్దులుPottodiki puttedu buddulu
Telugu Samethalu Starting With Letter R
రాజుల సొమ్ము రాళ్ళ పాలుRajula sommu ralla palu
రామాయణమంతా విని రాముడికి సీత ఏమౌతుందని అడిగినట్టుRamayanamantha vini ramudiki seta emavutundi ani adigadanta
రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా?Raju thaluchukunte debbalaku kodhava ?
రెంటికీ చెడిన రేవడి చందానRentiki chedina revadi chandana
రోలు వచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్టుRolu vacchi maddelatho mora pettukunnattu
రుచిమరిగిన పిల్లి ఉట్టిమీద కెగిరినట్లుRuchi marigina pilli uttimeedakegirinattu
రోషం లేని మూతికి మీసమెందుకు?Rosham leni mootiki mesam enduku ?
రోహిణీ కార్తెలో ఎండలకు రోళ్ళు పగులుతాయటRohinee kartheloni endalaku rollu paguluthayanta
రాచ పీనుగు తోడు లెకుండా పోదుRacha peenugu thodu lekunda podhu
రధసప్తమి నాటికి రధాలు తిరుగుతాయటRatha sapthami naatiki radhalu tirugutayata
రాజు గారి మొదటి భార్య పతివ్రత అంటే.. మరి రెండో భార్య .. ?Raju gari modhati bharya pativratha ante mari rendo bharya ?
రామాయణం రంకు భారతం బొంకుRamayanam ranku bharatam bonku
రెక్కలు తెగిన పక్షిలాగాRekkalu thegina pakshi laga
రోజూ చచ్చే వాడి కొసం ఎడవడం ఎందుకుRoju chache vadi kosam edavadam enduku
రక్షించే వాడినే భక్షించినట్టుRakshinche vaadine bhakshinchi nattu
Telugu Samethalu Starting With Letter S
సంతోషమే సగం బలంSanthoshame Sagam balam
సర్వేంద్రియాణాం నయనం ప్రధానంSarvendhriyanam nayanam pradhanam
సముద్రమన్నా ఈదవచ్చుగాని సంసారం ఈదటం కష్టంSamudhramanna eedavacchu kani samsarani edatam kastam
సంతానం కోసం సముద్ర స్నానానికి వెళితే ఉన్నలింగం ఊడిపోయిందటSanthanam kosam Samudhra stnananiki velthe unna lingam udi poyindanta
సత్రం భోజనం మఠం నిద్ర అన్నట్లుSatram bojanam matam nidra annattu
సన్యాసీ సన్యాసీ రాసుకుంటే బూడిద రాలిందంటSanyasi sanyasi rasukunte budidha ralindanta
సందట్లో సడేమియాSandatlo sademiya
సముధ్రంలో కాకి రెట్టలాSamudhramlo kaki rettala
సాగితే బండి సాగకపోతే మొండిSaagite bandi saagakapote mondi
సింగినాదం జీలకర్రSinginadham jeelakarra
సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవిseta kastalu setavi peta kastalu petavi
సర్వేజనా:సుఖినోభవన్తుSarvejana sukhinobhavanthu
సంసారం గుట్టు,వ్యాధి రట్టుSamsaram guttu,vyadhi rattu
సొమ్మొకడిది సోకొకడిదిSommokadidhi sokokadidhi
సుబ్బి పెళ్ళి ఎంకి చావుకొచ్చిందిSubbi pelli enki chavuku vachindi
Telugu Samethalu Starting With Letter U
ఉన్న మాటంటే ఉలుకెక్కువUnna maata ante ulukekkuva
ఉప్పు తిన్న ప్రాణం ఊరుకోదుUppu tinna pranam urukodhu
ఉన్నదాన్ని వదిలి లేనిదానికోసం వెదుకులాడినట్లుUnna danni vadili leni danikosam vedhukuladinattu
ఉపాయం చెప్పవయ్యా అంటే, ఉరిత్రాడు తెచ్చుకోమన్నాడటUpayam cheppavayya ante uri tadu tecchukomannadata
ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లుUrumu urimi mangalam meda padinattu
Telugu Samethalu Starting With Letter V
వడ్డించే వాడు మనవాడైతే వెనక బంతిలో కూర్చున్నా ఫరవాలేదుVaddinche vadu manavadyithe venka bantilo kurchunna paravaledhu
వసుదేవుడంతటివాడు గాడిద కాళ్లు పట్టుకున్నట్లుVasudhevudu antati vadu gadida kallu pattukunnattu
వంగుతున్న కొద్దీ ఇంకా వంచాలని చూస్తారుVangutunna konddi inka vanchalani chustaru
వంట ఇంటి కుందేలు లాగాVanta inti kundhelu laga
విగ్రహపుష్టి నైవేద్యనష్టిVigraha pusti nivedhya nasti
వినేవాడు వెధవ అయితె పంది కూడా పురాణం చెపుతుందిVine vaadu vedhava ayithe pandi kuda puranam chebutundi
వస్తే కొండ పోతే వెంట్రుకVaste konda lekapothe ventruka
వాపు బలపూ కాదూ వాత అందమూ కాదుVaapu balapu kadhu vaatha andhamu kadhu
వాసి తరిగితే వన్నె తరుగుతుందిVaasi tarigite vanne tarugutundi
విత్తు ముందా చెట్టు ముందా ?Vittu mundha chettu mundha ?
విదియ నాడు కాకపోతే తదియ నాడైనా కనపడక తప్పదుVidhiya nadu kakapothe tadhiya nadayina kanapadaka tappadu
వేన్నీళ్ళకి చన్నీళ్ళు తోడుVennellaku channellu thodu
వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలిViyyaniki ayina kayyaniki ayina sama ujji undali
వేపకాయంత వెర్రిVepakayantha verri
వైద్యోనారాయణోహరిVidhyo narayano hari
వృద్ధనారీ పతివ్రతVrudhha naaree pativartha
వింటే భారతం వినాలి తింటే గారెలే తినాలిVinte bharatham vinali tinte garale tinali
వాన ఉంటే కరువు,పెనివిటి ఉంటే పేదరికం లేదుVaana unte karuvu penimiti unte pedharikam ledhu
వెక్కిరించబోయి బొర్లాపడినట్టుVekkirinchaboyi borla padinattu
వచ్చిన అపవాదు చచ్చినా పోదుVacchina apavadu chachina podhu
వెతకబోయిన తీర్ధం ఎదురయినట్టుVetakaboayina teerdham edurayinattu
వెనకా ముందు చూసి మాట్లాడాలిVenka mundhu chusi matladali
వచ్చేదల్లా రానీ పోయేదల్లా పోనీVacheadallaa raanee poayeadallaa poanee
వెదవ ముండకయిన వెవిళ్ళు తప్పవుVedava mumDakayina vevillu tappavu
వేమన్న మాట వెర్రి మాట కాదుVemanna maata verri maata kaadu
Telugu Samethalu Starting With Letter Y
యెల్లమ్మను ఎంచనక్కరలేదు, పోలమ్మను పొగడనక్కరలేదు.Yallammani yenchanakkaraledu polammani pogadanakkaraledhu

 

Telugu Samethalu PDF

null

null

Click To Download : Samethalu PDF

Also Read:

Teluguu Podupu Kathalu

Balli Sastram in Telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here