శక్తివంతమైన బాంబులేసినా చెక్కుచెదరదు – మోడీ బస చేసిన హోటల్‌ ప్రత్యేకతలివే!

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు గత కొద్ది రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేసిన ఇజ్రాయెల్.. మోడీ అద్భుతమైన ఆతిథ్యాన్ని అందిస్తోంది. ఇజ్రాయెల్‌లో ప‌ర్య‌టిస్తున్న తొలి భార‌త ప్ర‌ధానిగా నరేంద్ర మోడీ చరిత్ర కెక్కిన విషయం తెలిసిందే.

ప్రపంచంలోనే అత్యుత్తమ భద్రత

అయితే, న‌రేంద్ర మోడీకి ఆ దేశం క‌ళ్లు చెదిరే ఆతిథ్యం ఇస్తోంది. ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ భ‌ద్రతా ప్ర‌మాణాలు క‌లిగిన హోట‌ల్‌గా పేరుగాంచిన జెరుసెలెంలోని కింగ్ డేవిడ్‌లో మోడీకి బ‌స ఏర్పాటుచేశారు.

బాంబులేసినా..

బాంబు దాడులు, ర‌సాయ‌న దాడుల‌తోపాటు భూమ్మీద జ‌రిగే ఎలాంటి దాడుల నుంచైనా ర‌క్ష‌ణ క‌లిగించే ఏర్పాట్లు ఈ హోటల్లో ఉన్నాయి. అంతేగాక మోడీ ఉన్న సూట్‌కు మ‌రో ప్ర‌త్యేక‌త ఉంది.

మొత్తం హోటల్‌పై బాంబు దాడి జ‌రిగినా..

ప్ర‌ధాని ఉన్న సూట్‌కు మాత్రం ఏమీ కాద‌ని కింగ్ డేవిడ్ హోట‌ల్ డైరెక్ట‌ర్ ఆఫ్ ఆప‌రేష‌న్స్ సెల్డాన్ రిట్జ్ వెల్ల‌డించారు.

అమెరికా తర్వాత భారత్‌కే

ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న మొత్తం బాధ్య‌త‌లు కూడా రిట్జ్ చూసుకుంటున్నారు. మోడీ, ఆయ‌న వెంట వెళ్లిన ప్ర‌తినిధుల బృందానికి బ‌స ఏర్పాటు చేయ‌డానికి 110 గ‌దుల‌ను ఖాళీ చేయించిన‌ట్లు రిట్జ్ చెప్పారు. చ‌రిత్ర‌లో ప్ర‌తి అమెరికా అధ్య‌క్షుడికి తాము ఆతిథ్య‌మిచ్చామ‌ని, ఇప్పుడు ప్ర‌ధాని మోడీకి ఇస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు.

మోడీకి ప్రత్యేకంగా..

భ‌ద్ర‌త‌తో పాటు మోడీ, ఆయ‌న ప్ర‌తినిధులు తీసుకునే ఆహారంపై కూడా ప్ర‌త్యేకంగా శ్ర‌ద్ధ తీసుకున్న‌ట్లు రిట్జ్ వెల్ల‌డించారు. మోడీ ఉన్న సూట్‌కు ప్ర‌త్యేకంగా కిచెన్ ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. మోడీ గుజ‌రాతీ ఫుడ్ మాత్ర‌మే తింటున్న‌ట్లు రిట్జ్ వివరించారు. ఇది ఇలా ఉండగా, ప్రధాని మోడీ బుధవారం ఇజ్రాయెల్ అధ్యక్షడు రూవెన్‌తో భేటీ అయ్యారు. ఇజ్రాయెల్‌తో భారత్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here