బాబాయ్ కోసం వెనక్కుతగ్గాడు..!

Jnr Ntr

Jr.Ntr Compromises with Ballaya

బాబాయ్ బాలయ్యకు అబ్బాయ్ తారక్ కు కొన్నేళ్లుగా పొసగడం లేదని అందరికీ తెలిసిందే. అయితే… తారక్ ఆలోచనలో మాత్రం మార్పు వచ్చినట్టుంది. ఇదివరకు బాబాయ్ సినిమా రిలీజ్ ఉంటే… దానిపై తన సినిమా పోటీగా రిలీజ్ చేయడానికి కూడా తగ్గేవాడు కాదు తారక్. కానీ.. ఇప్పుడు తన ‘జై లవకుశ’ విషయంలో మాత్రం తన వైఖరిని మార్చేసుకున్నాడు. నిజానికి బాలయ్య ‘పైసా వసూల్’కి ఓ వారం ముందుగా ‘జై లవకుశ’ను విడుదల చేయాలని నిర్మాత కల్యాణ్ రామ్, తారక్ భావించారు.

అయితే… ఇలా ప్రతి సారీ బాబాయ్ సినిమాతో పోటీగా సినిమాలు విడుదల చేస్తే అభిమానులకు రాంగ్ మెసేజ్ వెళ్లే అవకాశం ఉందని అనుకోవడంతో బాబాయ్ ‘పైసా వసూల్’ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ‘జై లవకుశ’ విడుదల చేయాలనుకుంటున్నారని ఫిలింనగర్ టాక్. ‘పైసా వసూల్’ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం రోజే దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించిన దృష్ట్యా.. వారిని డేట్ మార్చుకోమనడం కూడా సమంజసంగా ఉండదని భావించి, నందమూరి సోదరులు వెనక్కు తగ్గినట్టు మరో వాదన. ఏది ఏమైనా నందమూరి అభిమానులకు మాత్రం ఇది మంచి వార్తే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here