ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దోపిడికి ప్రయత్నించిన దుండగులు ఎవరంటే?

ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దోపిడికి ప్రయత్నించిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ దోడిపికి ప్రయత్నించింది సర్ధార్ గ్యాంగ్ గా గుర్తించారు. నిందితులు హైద్రాబాద్ దాటి వెళ్ళలేదని పోలీసులు ప్రకటించారు.

మంగళవారం నాడు ఉదయం పదిగంటల ఐదు నిమిషాలకు మైలార్ దేవ్ పల్లిలో ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో చొరబడి దోపిడికి ప్రయత్నించారు గుర్తు తెలియని వ్యక్తులు.

అయితే ఈ ఘటన జరిగిన సమయంలో సిబ్బంది అతి చాకచక్యంగా వ్యవహరించడం వల్ల దోపిడి జరగకుండా అడ్డుకొన్నారు. అయితే నిందితులను పట్టుకొనేందుకు స్థానికులు ప్రయత్నించారు.

అయితే నిందితులు తమ వద్ద ఉన్న మారణాయుధాలను చూపి స్థానికులను బెదిరించారు. కత్తులు, పిష్టల్ సహయంతో నిందితులు బెదిరించారు. దోపిడి వ్యూహం బెడిసి కొట్టి నిందితులు పారిపోయారు. అయితే నిందితుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు.

 హైద్రాబాద్ దాటి వెళ్ళలేదు

ముత్తూట్ ఫైనాన్స్ ఘటనలో దోపిడి పాల్పడేందుకు ప్రయత్నించిన నిందితులు హైద్రాబాద్ దాటి వెళ్ళి పోయి ఉండరని పోలీసులు చెబుతున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని ఏసీపీ గంగారెడ్డి బుదవారం నాడు ప్రకటించారు. నిందితులు ఏ మార్గాల్లో హైద్రాబాద్ కు చేరుకొన్నారో గుర్తించినట్టు చెప్పారు. వారి కదలికలను తెలుసుకొన్నామన్నారు. 

సెక్యూరిటీ తక్కువనే ముత్తూట్ టార్గెట్

ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయాల వద్ద సెక్యూరిటీ తక్కువగా ఉంటుంది. అంతేకాదు ఎక్కువ మొత్తంలో బంగారం లభ్యమౌతోందని దోపిడి దొంగలు భావిస్తున్నారు. అందుకే ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దోపిడికి పాల్పడేందుకు ప్లాన్ చేస్తున్నారని పోలీసులు చెప్పారు. నిందితులు ఉపయోగించిన టవేరా వాహనాన్ని స్వాధీనం చేసుకొన్నట్టు పోలీసులు తెలిపారు. హ్యాపీ హోమ్ అపార్ట్ మెంట్ లో సోదాలు నిర్వహించినట్టు చెప్పారు.

సర్ధార్ గ్యాంగ్ పనేనా?

ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దోపిడికి పాల్పడేందుకు ప్రయత్నించింది సర్ధార్ గ్యాంగ్ పనేనని పోలీసులు గుర్తించారు. గతంలో కూడ ఈ గ్యాంగ్ ముంబైలోని ముత్గూట్ కార్యాలయంలో చోరికి విఫలయత్నం చేసిందని పోలీసులు గుర్తుచేస్తున్నారు. మైలార్ దేవ్ పల్లి లోని ముత్గూట్ ఫైనాన్స్ కార్యాలయంలో నిందితుల దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అయితే ఈ దృశ్యాల ఆధారంగా సర్ధార్ తో పాటు బంటి అనే వ్యక్తిని పోలీసులు గుర్తించారు. 

నెలరోజులుగా రెక్కీ

మైలార్ దేవ్ పల్లి ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దోపిడి చేసేందుకు సుమారు నెలరోజులుగా నిందితులు రెక్కీ నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పలు సందర్భాల్లో నిందితులు హైద్రాబాద్ కు వచ్చినట్టు గుర్తించారు. ఈ మేరకు సిసిటీవి పుటేజీని పోలీసులు పరిశీలించారు. ముత్తంగి వద్ద నిందితులు ఓ స్వీట్ షాపుల్ స్నాక్స్ తీసుకొన్న దృశ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

ఆ ఇద్దరు ఎవరు?

ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో చోరికి ఐదుగురు వ్యక్తులు ప్రయత్నించినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ముత్తంగి వద్ద రికార్డైన సిసీటివి కెమెరాల్లో మాత్రం మరో ఇద్దరు కూడ ఉన్నారు. అయితే ఆ ఇద్దరు ఎవరనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దోపిడికి స్థానికులు ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ జరుపుతున్నారు. గుజరాత్ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనానికి టిఎస్ పేరుతో నకిలీ నెంబర్ ప్లేట్ ను తయారు చేసి పెట్టారని పోలీసులు చెప్పారు. నిందితుల కోసం 20 బృందాలు గాలిస్తున్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here