‘జై’కి రాత్రికి రాత్రే 5 మిలియన్ల వ్యూస్!

Jr NTR Jai Lava Kusa Movie First Look ULTRA HD Posters, WallPapers

Jai Lava Kusa

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టామినా ఇది. ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ‘జై లవ కుశ’ టీజర్ Ntrగురువారం సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ ద్వారా ‘జై’ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు. రావణాశురిడి భక్తుడిగా.. పవర్‌ఫుల్ మాస్ లుక్‌లో ఎన్టీఆర్ ఇరగదీశాడు. ‘ఆ రావణుణ్ని సంపాలంటే సముద్రం దాటాల.. ఈ రావణుణ్ని చంపాలంటే సముద్రం తాకే ధైర్యం ఉండాల’ అంటూ కొంచెం నత్తితో ఎన్టీఆర్ చెప్పిన డైలాగుకి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దీనికి తోడు ‘అసుర అసుర’ అంటూ దేవీశ్రీ ఇచ్చిన నేపథ్య సంగీతం అదుర్స్. అందుకే రాత్రికి రాత్రే ‘జై లవ కుశ’ టీజర్‌కు 5 లక్షల డిజిటల్ వ్యూస్ వచ్చాయి.

ఫేస్‌బుక్‌లో 1.6 మిలియన్ల వ్యూస్ రాగా.. యూట్యూబ్‌లో 3.6 మిలియన్ల మంది ఈ టీజర్‌ను చూశారు. ఇంత తక్కువ సమయంలో 50 లక్షలకుపైగా వ్యూస్ సాధించిన సౌతిండియన్ మూవీ ఇదేనంటూ ఎన్టీఆర్ ఆర్ట్స్ చెబుతోంది. ఈ విషయం పక్కనపెడితే.. టీజర్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ‘జై’ పాత్ర ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటే.. ఇక లవ, కుశ పాత్రలు ఎలా ఉండనున్నాయంటూ అభిమానుల్లో చర్చ మొదలైపోయింది. మరి ఆ పాత్రలను చిత్ర యూనిట్ ఎప్పుడు పరిచయం చేస్తుందో చూడాలి.

Source: Samayam

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here