Balli Sastram in Telugu

బల్లి శాస్త్రం

ప్రాచీన కలం నుండి ఎంతో ప్రసిద్ధి చెందిన మన హిందూ సంస్కృతి లో అత్యంత ప్రఖ్యాతి పొందిన మన శాస్త్రాలు ప్రపంచం అంతటా విస్తరించాయి. హిందూ సంస్కృతి ప్రకారం తెలిసి తెలియక మనిషి పైన బల్లి పడినా, లేదా బల్లి ని తాకిన కూడా ఏదో అరిష్టం జరుగుతుంది అని అంటారు. ఆ అరిష్టం తొలగిపోవుటకు బల్లి శాస్త్రం లో పరిహారాలు ఉన్నాయి అని., వాటిని పాటిస్తే ఆ అరిష్టం తొలగిపోతుంది అని ప్రసిద్ధి. బల్లి శాస్త్రం ప్రకారం బల్లి మనిషి ఒంటి మీద పడిన వివిధ అవయవాలను బట్టి వివిధ పరిహారాలు ఉంటాయి. ఆలా బల్లి శాస్త్రం నుండి కొన్ని ముఖ్యమైన అరిష్టాల గురించి తెలుస్కుందాం.

బల్లి శాస్త్రం – Balli Sastram in Telugu

బల్లి శాస్త్రం ప్రకారము బల్లి పడితే కలిగే అరిష్టం మగ వారికీ ఆడ వారికి వేరు వేరు గ ఉంటుంది. ముందుగా మగ వారికీ కలిగే అరిష్టాలు తెలుస్కుందాం.

బల్లి మగవారి మీద పడ్డప్పుడు కలిగే పరిణామాలు

Balli Sastram in Telugu For Male

బల్లి తలపై బాగాన పడినప్పుడు – మరణం సంభవించె అవకాశం

ముఖంఫై పడినప్పుడు – ఆర్ధిక సమస్యల నుండి విముక్తి కలిగి, లాభాలు గడిస్తారు

ఎడమ కన్నుఫై పడినప్పుడు – శుభం జరుగుతుంది

కుడి కన్నుఫై పడినప్పుడు – పనులు విజయవంతం కావు

నుదురుపై పడినప్పుడు – భార్య భర్తలు విడిపోవడం, అనుకోని సమస్యలు

కుడి చెంపఫై పడినప్పుడు – అనుకోని కారణాలవల్ల బాధపడటం జరుగుతుంది

ఎడమ చెవిఫై పడినప్పుడు – లాభాలు కలుగుతాయి, బాగా ఆదాయం వస్తుంది

పై పెదవిఫై పడినప్పుడు – కుటుంబ కలహాలు కలుగుతాయి

కింది పెదవిఫై పడినప్పుడు – ఆదాయంలో లాబాలు గడిస్తారు

రెండు పెదవుల మధ్య పడినప్పుడు – మృత్యువు సంభవించే అవకాశం

వీపుపై ఎడమ భాగంఫై పడినప్పుడు – జయం జరుగుతుంది

వీపుపై కుడి వైపు పడినప్పుడు – రాజ భయం కలుగుతుంది

మణికట్టుఫై పడినప్పుడు – అలంకారం చేసుకోవలసి వస్తుంది

మోచేయిఫై పడినప్పుడు – డబ్బుని నష్టపోతారు

వ్రేళ్ళ పై పడినప్పుడు – అనుకోని బంధువులు, స్నేహితుల ఇంటికి వస్తారు

కుడి భుజంఫై పడినప్పుడు – సమస్యలు కలుగుతాయి, కష్టాలు దరిచేరే అవకాశం

ఎడమ భుజంఫై పడినప్పుడు – పదిమందిలో అవమానం జరిగే అవకాశం

తొడలపై పడినప్పుడు – బట్టలు నాశనం అయ్యే అవకాశం

మీసాలపై పడినప్పుడు – కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది

కాలి వేళ్ళ పై పడినప్పుడు – అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి

కాలి పాదములపై బల్లి పడినప్పుడు – ప్రయాణం చేయవలసి వస్తుంది

బల్లి పంచాంగం – Balli Panchangam

బల్లి ఆడవారి శరీరంపై పడినప్పుడు జరిగే పరిణామాలు

Balli Sastram in Telugu For Female

బల్లి స్త్రీల తలపై పడినప్పుడు – మరణం సంభవించే అవకాశం

బల్లి తల కొప్పుపై పడినప్పుడు – అనారోగ్యం, రోగాలు కలిగే అవకాశం

బల్లి ఎడమ కన్నుపై పడినప్పుడు – స్త్రీలు భర్త ప్రేమని లేదా దగ్గరి వారి ప్రేమను పొందుతారు

బల్లి కుడి కన్నుపై పడినప్పుడు – తెలియని మనోవ్యధ, అనవసరమైన విషయాలు ఆలోచించడం బల్లి

రొమ్ము లేక వక్షోజాలపై పడినప్పుడు – శుభ సూచకం, మంచి జరిగే అవకాశం

బల్లి కుడి చెంపపై పడినప్పుడు – మగ బిడ్డ జన్మిస్తాడని నమ్మకం

బల్లి కుడి చెవిపై పడినప్పుడు – డబ్బు రాబడి, ధన లాభం, ఆదాయం కలుగుతుంది

బల్లి పై పెదవిపై పడినప్పుడు – గొడవలు, శత్రువులు పెరిగే అవకాశం

బల్లి కింది పెదవిపై పడినప్పుడు – కొత్త వస్తువులు కొంటారు

బల్లి రెండు పెదవులపై పడినప్పుడు – కష్టాలను సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది

బల్లి వీపుమీద పడినప్పుడు – చేదు వార్త లేదా మరణ వార్త వినవలసి వస్తుంది

బల్లి భుజంమీద పడినప్పుడు – బంగారు ఆభరణాలు, నగలు కొనే అవకాశం

బల్లి చేతులమీద పడినప్పుడు – లాభాలు కలుగుతాయి, డబ్బు గడిస్తారు

బల్లి ఎడమ చేయిమీద పడినప్పుడు – మానసిక ఒత్తిడి, ఎక్కువుగా ఆలోచించడం

బల్లి వేళ్ళమీద పడినప్పుడు – నగలు వేసుకొనే అవకాశం కలుగుతుంది

బల్లి కుడి భుజంమీద పడినప్పుడు – శృంగార సుఖం అనుభవిస్తారు

బల్లి గోళ్ళమీద పడినప్పుడు – కుటుంబంలో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం

బల్లి తొడలమీద పడినప్పుడు – కామ కోరికలు కలుగుతాయి

బల్లి మోకాళ్ళమీద పడినప్పుడు – స్త్రీలు అందరిలో ఆదరణ, అభిమానం సంపాదిస్తారు

బల్లి పిక్కలమీద పడినప్పుడు – ఇంటికి బంధువుల రావడం జరుగుతుంది

బల్లి చీలమండపై పడినప్పుడు – కష్టాలు కలిగే అవకాశం

బల్లి కుడి కాలుమీద పడినప్పుడు – శత్రు నాశనం జరిగే అవకాశం

బల్లి కాలి వేళ్ళమీద పడినప్పుడు – పుత్రుడు జన్మించే అవకాశం

Balli Sastram Remedy

పురాణాల ప్రక్రారం ఎప్పుడైతే బల్లి మీద పడటం కానీ, బల్లి ని తాకడం కానీ చేసిన వారు, వెంటనే తలస్నానం చేసి భగవంతుడి ముందు దీపం వెలిగించి మనస్సులో మహా మృత్యుంజయ మంత్రం జపిస్తే, బల్లి శకునం కి పరిహారం కలుగుతుందని ప్రసిద్ధి.

మహా మృత్యుంజయ మంత్రం

ఓం త్ర్యంబకం యజామహే సుగన్ధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బన్ధనాన్మృత్యో ర్ము క్షీయమామృతాత్

Explore More About Maha Mrityunjaya Mantra.

Balli Sastram In Telugu PDF

null

null

Balli Sastram In Telugu PDF Free Download

Click to Download PDF

Also Read:

Balli Sastram in English

Importance of Yoga

Surya Namaskaras

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here